Thursday, January 23, 2025

మహబూబాబాద్‌లో కౌన్సిలర్ హత్య

- Advertisement -
- Advertisement -

Councilor assassinated in Mahabubabad

పట్టపగలు పలు కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా
ట్రాక్టర్‌తో ఢీకొట్టి, గొడ్డలితో తల నరికి హత్యచేసిన దుండగులు

వ్యాపార వివాదాలే హత్యకు కారణమని భావిస్తున్నట్లు
ప్రకటించిన ఎస్‌పి శరత్‌చంద్ర పవార్

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: పట్టపగలు నడిరోడ్డుపై మున్సిపల్ కౌన్సిలర్ దారుణహత్యకు గురైన ఘటన గురువారం జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌లో చోటుచేసుకొంది. బైక్‌పై వెళుతున్న 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి నాయక్‌ను ప్రత్యర్థులు ట్రాక్టర్‌తో ఢీకొట్టి, గొడ్డలితో నరికి హత్య చేశారు. స్థానిక బాబునాయక్ తండాలో నివాసం ఉండే రవినాయక్ ఎంపి మాలోతు కవితతో కలిసి పలు కా ర్యక్రమాల్లో పాల్గొని ఇంటికి వెళుతున్న క్రమం లో మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. తన ఇంటికి దగ్గర వె నుకనుంచి ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. దీంతో ఆయ న బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. ట్రాక్టర్ వెనుక ఉన్న కారులోంచి దిగిన వ్యక్తులు కింద పడ్డ రవినాయక్‌పై దాడిచేసి చంపివేసి వచ్చిన వాహనంలో పారిపోయారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రవినాయక్ గురించి స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. కొనఊపిరితో ఉన్న అయన్ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలపాలైన ఆయనను కాపాడేందుకు వై ద్యులు ప్రయత్నించినప్పటికీ కొద్దిసేపటికే క న్నుమూశాడు. రవినాయక్ హత్య వార్త దావానంలా వ్యాపించడంతో మాలోతు కవితతో కలిసి పలు కా ర్యక్రమాల్లో పాల్గొని ఇంటికి వెళుతున్న క్రమం లో మధ్యాహ్నం 11.40 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.

తన ఇంటికి దగ్గర వె నుకనుంచి ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. దీంతో ఆయ న బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. ట్రాక్టర్ వెనుక ఉన్న కారులోంచి దిగిన వ్యక్తులు కింద పడ్డ రవినాయక్‌పై దాడిచేసి చంపివేసి వచ్చిన వాహనంలో పారిపోయారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రవినాయక్ గురించి స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. కొనఊపిరితో ఉన్న అయన్ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలపాలైన ఆయనను కాపాడేందుకు వై ద్యులు ప్రయత్నించినప్పటికీ కొద్దిసేపటికే క న్నుమూశాడు. రవినాయక్ హత్య వార్త దావానంలా వ్యాపించడంతో అధికార పార్టీతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, తండావాసులు, హతుడి బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఐసియులో ఉన్న రవి నాయక్‌ను చూసేందుకు పోలీసులు, ఆస్పత్రి సిబ్బందిని తోసుకుంటూ లోపలకు వెళ్లారు. విషయం తెలుసుకున్న ఎంపి మాలోతు కవిత, ఎంఎల్‌ఎ బానోత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి. ఫరీద్, కాంగ్రెస్ నాయకులు జెన్నారెడ్డి భరత్‌చందర్ రెడ్డి, డాక్టర్ భూక్య మురళీనాయక్, చుక్కల ఉదయ్‌చందర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, కౌన్సిలర్లు రవినాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

స్వత్రంత్ర కౌన్సిలర్‌గా గెలిచిన రవినాయక్ స్వంత వార్డులో పట్టపగలే హత్యకు గురవడం స్థానికంగా సంచలనం కలిగించింది. రవి కౌన్సిలర్‌గా ఎన్నికైన తర్వాత టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నల్ల బెల్లం వ్యాపారంలో వచ్చిన వివాదాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో వచ్చిన వివాదాలే హత్యకు కారణమని ఘటనా స్థలిని పరిశీలించిన సందర్భంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. రవితో కలిసి వ్యాపారంలో భాగస్వాములైన అరుణ్, విజయ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ సతీష్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News