Monday, December 23, 2024

ఎంఎల్‌సి కవిత చొరవతో జగిత్యాల వైస్ చైర్మన్‌పై అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని ఆ పార్టీ ఎంఎల్‌సి కల్లకుంట్ల కవిత పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం నాడు ఆ పార్టీ ఎంఎల్‌సి కవితతో సమావేశమయ్యారు. వైస్ చైర్మన్‌పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్, ఎంఎల్‌సి ఎల్. రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎంఎల్‌సి కవితతో కీలక మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ, అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయవలసిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు.

దాంతో ఎంఎల్‌సి కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్‌లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ప్రకటించారు. పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు.

Kavitha 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News