Monday, December 23, 2024

గురుకుల వ్యవసాయ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 8న కౌన్సిలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలోని వనపర్తి, కరీంనగర్ అగ్రికల్చర్ మహిళా కాలేజీల్లో బిఎస్‌సి(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి ఈనెల 8న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సోసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. కౌన్సిలింగ్ వివరాలు కేటగిరీల వారీగా వెబ్ సైట్ https://mjptbcwreis.telangana.gov.in లో పొందు పరిచామన్నారు. దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలు పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు. అగ్రిసెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి రెండో విడత కౌన్సెలింగ్,

ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంసెట్, అగ్రిసెట్ లో వచ్చిన ర్యాంక్ తో పాటు గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారే ఈ కౌన్సిలింగ్ కు హాజరుకావాలని మల్లయ్య బట్టు సూచించారు. వెబ్ సైట్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అన్ని సర్టిఫికెట్‌లతో హాజరుకావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News