Wednesday, January 22, 2025

పాలిటెక్నిక్ ప్రవేశాలకు కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

శ్రీరాంపూర్: సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ప్రవేశాల కొరకు కౌన్సిలింగ్ మంగళవారం నిర్వహించారు. కౌన్సిలింగ్‌కు ఏరియా జీఎం సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అలాట్‌మెంట్ లెటర్లు విద్యార్దిని విద్యార్థులకు అందజేశారు.

అనంతరం జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే దృ క్పదంతో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలను శ్రీరాంపూర్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలోనే శ్రీరాంపూర్ పాలిటెక్నిక్ కళాశాల అత్యుత్తమ స్థాయిలో ఉందని, కళాశాలలో చదివిన విద్యార్దిని విద్యార్ధులు వివిధ కంపెనీల్లో అత్యున్నత హోదాలో ఉద్యోగాలు చేస్తున్నార న్నారు.

పాలిటెక్నిక్ కళాశాలలో అధునాతన ల్యాబ్‌లు, క్రీడా ప్రాంగణం ఉన్నాయని, ఉపాద్యాయులు చెప్పిన పాఠాలు విద్యార్థులు వింటూ పై స్థాయికి రావాలని కోరారు. ఈ కౌన్సిలింగ్‌లో ఇంచార్జి కరస్పాండెంట్ ప్రకాష్‌రావు, ఇంచార్జి ప్రిన్సిపాల్ ఆనంద్‌కుమార్, స్టేట్ బోర్డు ఆఫ టెక్నిక ల్ ఎడ్యుకేషన్ ఆండ్ ట్రైనింగ్ నుండి దేవేందర్, అడ్మీషన్ ఇంచార్జి నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News