- Advertisement -
హైదరాబాద్ : జిల్లా పరిధిలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పారా మెడికల్ కళాశాల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రవేశాల కోసం ఈనెల 15వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటి తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పారామెడికల్ కోర్సులకు దరఖాస్తులు చేసిన అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో హరిహరకళభవన్, పాట్నీసెంటర్ వద్ద కార్యాలయంలో ఉదయం 9గంటలకు హాజరుకావాలని కోరారు. మెరిట్, రోస్టర్ ప్రకారం కౌన్సిలింగ్ చేసి గుర్తింపు పొందిన కళాశాలతో సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. విద్యార్ధిని, విద్యార్ధులు, కళాశాల యాజమాన్యం తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి కౌన్సిలింగ్‌లో పాల్గొనాలని కోరారు.
- Advertisement -