Tuesday, November 5, 2024

ఇన్‌శాట్ 3డిఎస్ ప్రయోగానికి కౌంట్‌డౌన్

- Advertisement -
- Advertisement -

చెన్నై : జియోసింక్రనస్ ప్రయోగ నౌక (జిఎస్‌ఎల్‌వి)తో ఇన్‌శాట్ 3డిఎస్ వాతావరణ ఉపగ్రహం ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం వెల్లడించింది. 16వ యాత్రలో జిఎస్‌ఎల్‌వి ఎఫ్14 ప్రయోగాన్ని శనివారం సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ రోదసీ కేంద్రం నుంచి జరుపుతారు. ఇన్‌శాట్ 3డిఎస్ ఉపగ్రహం జియోస్టేషనరీ కక్షలో ప్రవేశపెట్టనున్న మూడవ తరం వాతావరణ ఉపగ్రహం తదుపరి యాత్రలో భాగం.

దీనికి భూతర వైజ్ఞానిక శాస్త్రాల మంత్రిత్వశాఖ పూర్తిగా ఖర్చు భరిస్తోంది. ‘జిఎస్‌ఎల్‌వి ఎఫ్14/ ఇన్‌శాట్ 3డిఎస్ మిషన్: శనివారం (17న) సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగానికి ముందుగా 27.5 గంటల కౌంట్‌డౌన్ మొదలైంది’ అని ఇస్రో తెలియజేసింది. జనవరి 1న పిఎస్‌ఎల్‌వి సి58/ ఎక్స్‌పోశాట్‌ను విజయవంతంగా ప్రయోగించిన తరువాత 2024లో బెంగళూరు ప్రధాని కేంద్రంగా గల ఇస్రో సంస్థకు ఇది రెండవ ఉపగ్రహ ప్రయోగం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News