Thursday, September 19, 2024

పుష్పరాజ్ రూల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప- 2 ః ది రూల్’. ఇక డిసెంబరు 6న థియేటర్స్‌లో ప్రారంభం కానున్న పుష్పరాజ్ రూల్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 100 రోజుల్లో అంటే డిసెంబరు 6న ఈ సినిమా విడుదలకానుంది. ఇక రికార్డులు లెక్కపెట్టుకోవడమే. పుష్ప ది రైజ్ సినిమాతో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. ఎవరూ ఊహించని క్రేజ్‌తో దూసుకుపోతున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప- 2’లో అద్వితీయమైన నటన కోసం, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కుమార్..మేకింగ్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్ అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప- 2 ది రూల్ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో వున్న ఈ చిత్రం మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News