Saturday, December 21, 2024

బిజెపి పై విశ్వసనీయత తగ్గుతుంది

- Advertisement -
- Advertisement -

Counter blow to BJP in Chandur

హైదరాబాద్ : చండూరు లో బిజెపి కి మరోమారు ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక పురపాలక సంఘం పరిధిలోని 10 వ వార్డు కు చెందిన బ్రహ్హ్మం గారి దేవాలయ పాలక వర్గ కమిటీ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. చేరిన వారిలో సిద్ధి బ్రహ్మాచారి, సిద్ధి అమృత చారి,సిద్ధి సతీష్ చారి లతో పాటు వారి వారి అనుచరులు బిజెపి కి రాజీనామా చేసి టి ఆర్ యస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. టి ఆర్ యస్ నుండి బిజెపి లోకి పోవడం పొరపాటు జరిగిందని,తిరిగి టి ఆర్ యస్ లో చేరడం ద్వారా సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని టి ఆర్ యస్ లో చెరిన నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు పోయి రేపటి ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ విజయానికి కృషి చేస్తామన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజు కు బిజెపి పై ప్రజల్లో విశ్వసనీయత తగ్గుతుందని చెప్పడానికి తాజాగా చండూరు పురపాలక సంఘం పరిధిలోని చేరికలు నిదర్శమన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న ,సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, టి ఆర్ యస్ నేత అచ్చన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News