రూ.4.35 కోట్ల విలువైన నకిలీ మందులు స్వాధీనం
పరారీలో ఫార్మా కంపెనీ యజమాని
డ్రగ్స్ కంట్రోల్ విభాగ డిజి కమలాసన్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే క్యాన్సర్ నివారణకు ఉపయోగించే అతిపెద్ద నకిలీ మందుల తయారీదారులను నగరంలోని మచ్చ బొల్లారంలో ర్రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వీరి నుంచి దాదాపు నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల విలువైన నకిలీ క్యాన్సర్ నివారణ మందులను స్వాధీనం చేసుకున్నామని డ్రగ్స్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్ రెడ్డి వెల్లడించారు. ఆస్ట్రిక హెల్త్ కేర్ అనే కంపెనీ క్యాన్సర్ నివారణకు ఉపయోగించే మందులను నకిలీ, కల్తీ మందులను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో ఈనెల 2వ తేదీన డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్, ప్రత్యేక బృందాలు, హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతా ల్లో దాడులు నిర్వహించిందని డిజి కమలాసన్ రెడ్డి వివరించారు. ఈ నకిలీ మందుల చెలామణికి సంబందించిన ఇన్వాయిస్‌లతో పోస్టల్ శాఖ ద్వారా కంపెనీ చిరునామాకు అల్వాల్‌లో వెతకగా అది తప్పుడు అడ్రస్‌గా నిర్దారణ అయ్యిందని పేర్కొన్నారు. అనంతరం, ఐడిఎ చర్లపల్లి, నాచారం, మేడ్చల్‌లలోని వివిధ కొరియర్
కార్యాలయాలను తనిఖీ చేసి ఆస్ట్రిక హెల్త్ కేర్ ద్వారా పంపిణీ అయినవాటిని తనిఖీ చేసినట్లు తెలిపారు.డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి చెందిన విజిలెన్స్ మరొక ప్రత్యేక బృందం కీసరలోని ఆస్ట్రిక హెల్త్ కేర్ సంస్థపై దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘటన : డిజి
నకిలీ మందులు ప్రజారోగ్యానికి ముప్పు కలిగించడమే కాకుండా రోగికి కాలక్రమేణా, వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తుందని డ్రగ్స్ కంట్రోల్ డిజి కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ నకిలీ క్యాన్సర్ మందులకు సంబంధించిన రహస్య కార్యకలాపాలను గుర్తించి, స్వాధీనం చేసుకొన్న ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘటన అని పేర్కొనారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆస్ట్రికా హెల్త్‌కేర్ డైరెక్టర్ కె. సతీష్ రెడ్డి పరారీలో ఉన్నాడని, అతనిని వెతకడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెంది న అసిస్టెంట్ డైరెక్టర్ పి. రాము నేతృత్వంలో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు జి. శ్రీకాంత్, కె. అన్వేష్, ఎం. చంద్రశేఖర్, వి.అజయ్, ఎస్.వినయ్ సుష్మీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారని తెలిపారు. ‘ఆస్ట్రికా హెల్త్‌కేర్’ ప్రాంగణం నుండి నకిలీ డ్రగ్ స్టాక్ డెలివరీ చేస్తున్న కొరియర్ బాయ్‌ని డిసిఎ అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. మచ్చ బొల్లారం వద్ద మూడు షట్టర్లలో ఈ నకిలీ మందులు నిల్వ చేశారని అన్నారు. ఈనెల 4వ తేదీన ఈ నకిలీ మం దుల తయారీ లొకేషన్‌పై దాడి చేసి నాలుగు కోట్ల 35 లక్షల విలువైన 36 రకాల క్యాన్సర్ నివారణ మందులు, ఇతర మందులను స్వాధీనం చేసుకున్నామన్నాన్నారు. స్వాధీనం చేసుకున్న కొన్ని మందులలో నకిలీ స్వభావం కలిగి ఉన్నట్లు అధికారులు కనుగొన్నారని పేర్కొన్నారు. మందుల లేబుల్స్ ఉనికిలో లేని కంపెనీ ‘ఆస్ట్రా జెనెరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వివరాలను కలిగి ఉన్నాయని తెలిపారు.