- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 11 జిల్లాలకు సంబంధించి 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల బరిలో 699 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
- Advertisement -