Monday, December 23, 2024

7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 5న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆయా రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుప్పలి, పశ్చిమ బెంగాల్‌లోని ధుగ్‌పురి, జార్ఖండ్‌లోని దుమ్రి, త్రిపులోని బోక్సానగర్, ధన్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

బాగేశ్వర్, ధుగ్‌పురి, ధన్‌పూర్ స్థానాలు బిజెపి అధీనంలో ఉండగా ఘోసి స్థానం సమాజ్‌వాది పార్టీ అధీనంలో ఉండేది. బుక్సానగర్‌లో సిపిఎం, దుమ్రిలో జెఎంఎం, పుతుప్పలిలో కాంగ్రెస్ అధీనంలో ఉండేవి.

కాగా..ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా బాగేశ్వర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బిజెపి అభ్యర్థిపై ముందంజలో ఉన్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి. త్రిపురలోని రెండు స్థానాలలో బిజెపి ఆధిక్యతలో ఉంది.

ఘోసి అసెంబ్లీ స్థానంలో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి బిజెపి అభ్యర్థిపై ఆధిక్యతను కనబరుస్తున్నారు. కేరళలోని పుతుప్పలి స్థానంలో కాంగ్రెస అభ్యర్థి చందీ ఓమెన్ ఆధిక్యతలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ధుప్‌గురి స్థానంలో టిఎంసి, బిజెపి అభ్యర్థి మధ్యనే ప్రధాన పోటీ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News