కోల్‌కతా/ రాంచి/ అగర్తల: పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, త్రిపురలో ఉప ఎన్నిలకు జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ నాలుగు స్థానాలకు ఈ నెల 5న పోలింగ్ జరిగింది. కేంద్రంలో అధికారంలో బిజెపి, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి’ కి మధ్య జరగుతున్న ఈ తొలి పోరులో ఎవరిది పైచేయి కానుందో తెలియనుంది. జార్ఖండ్‌లో డుమ్రి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండియా కూటమి భాగస్వామి అయిన జార్ఖండ్ ముక్తిమోర్చా(జెఎంఎం)కు చెందిన బేబీ దేవి, ఎన్‌డిఎ కూటమి మిత్రపక్షమైన ఎజెఎస్‌యుకు చెందిన యశోదా దేవి మధ్య ముఖాముఖి పోటీ ఉంది. కాగా త్రిపురలోని బోక్సానగర్, దన్‌పూర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఈ రెండు స్థానాల్లోను బిజెపి, సిపిఎం పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. కాగా పశ్చిమ బెంగాల్‌లోని ధుఫ్‌గురిలో తృణమూల్ కాంగ్రెస్, సిపిఎంకాంగ్రెస్, బిజెపి మధ్య త్రిముఖ పోటీ ఉంది.
నేడు నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -