- Advertisement -
లక్నో : ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ క్రమక్రమంగా యాక్టివ్ అవుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదంపై తీవ్రంగా స్పందిస్తూ దేశం అంతర్యుద్ధం దిశగా వెళ్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కర్ణాటకలో మూడు రోజుల పాటు విద్యాసంస్థలన్నిటినీ మూసేశారు.
- Advertisement -