Friday, December 20, 2024

మోడీ పాలనలో దేశం సురక్షితం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : ప్రధాని నరేంద్రమోడీ పాలనలో భారతదేశం సురక్షితంగా ఉందని కేంద్రం భా రీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. సోమవారం పాలమూరు గ్రామీణ మండలం కోడూరు గ్రామంలో మండల అధ్యక్షుడు రాజుగౌడ్, కోడూరు ఎంపిటిసి ఆధ్వర్యంలో కేంద్ర పథకాల లబ్ధిదారుల సమావేశం ఏర్పాటు చేశారు. జనసంపర్క్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భ ంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ వచ్చిన తర్వాత దేశ రక్షణ కోసం పని చేస్తున్న మన సైనికులకు అధునాతన ఆ యుధాలను ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. కాంగ్రెస్ సమయంలో అయితే చిదంబరం లేఖలు రాసి సరిపెట్టుకునేదని ఎద్దేవా చేశారు. భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచ దేశాలలో ఏ దేశానికి వెళ్లినా ప్రధాని మోడీకి గౌరవ వందనం చేసి స్వాగతం పలుకుతున్నారని అన్నారు.

ప్రధాని పేదల సంక్షేమం అభివృద్ధి అవినీతి పాలన లక్షంగా పని చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో రెండు రూపాయలు ఇస్తే లబ్ధిదారునికి రెండు రూపాయలు చేరుతున్నాయని ఆయన తెలిపారు. మధ్యలో దళారీ వ్యవస్థ లేదని కొనియాడారు. రైతులకు కిసాన్ సమాన్ నిధి కింద ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. చైనా బార్డర్‌లు నాసాయి అనే గ్రామంలో ఒక మహిళా మోడీ పాలనకు ముందు కలుషిత నాలా నీళ్లు తాగేవాళ్లమని ప్రధాని మోడీ వచ్చిన తర్వాత శుద్ధ జలాలు ఇస్తున్నారని ఆమె తెలిపిందన్నారు.

పేదల సంక్షేమం అభివృద్ధి అవినీతి రహిత పాలన లక్షంతో ప్రధాని మోడీ పని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ , సీనియర్ నాయకులు గురుజు రాజేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, ఎన్.పి. వెంకటేష్, జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, ఉపాధ్యక్షులు కృష్ణ వర్ధన్‌రెడ్డి, క్రిస్టియన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్‌రెడ్డి, కోశ అధ్యక్షులు పాండురంగారెడ్డి, జయశ్రీ, రాజుగౌడ్ , శశిధర్‌రెడ్డి, కోస్గీ సతీష్‌కుమార్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News