- Advertisement -
హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని టిఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి జరుగుతుందన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలతో అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, విద్యుత్ రంగాన్ని కేంద్రం తన ఆధీనంలోకి తీసుకొని కార్పొరేట్ల కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. రైతుల ఆందోళనలపై సెలబ్రిటీల ట్వీట్లు దురదృష్టకరమని దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనలపై కేంద్రం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాల చేతిలో ఉన్న అంశాలను సెంట్రలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని, రాష్ట్రాల హక్కులను హరించే కుట్ర జరుగుతోందన్నారు. రైతులపై భారం పడకుండా విద్యుత్ బిల్లులు ఉపసంహరించుకోవాలన్నారు.
- Advertisement -