Tuesday, September 17, 2024

దేశంలో నంబర్ 1 విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్

- Advertisement -
- Advertisement -

ఓవరాల్ కేటగిరిలో అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ మద్రాస్

చెన్నై: నేషనల్ ఇన్సిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్‌వర్క్ (నిర్ఫ్) ర్యాంకింగ్స్-2024 సోమవారం విడుదలయ్యాయి. ఐఐటీ మద్రాస్ దేశంలో నంబర్ వన్ విద్యాసంస్థగా నిలిచింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు), ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్‌లు ఆ తర్వాతి వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియా సమావేశంలో ర్యాంకులను ప్రకటించారు.

ఇవి 9వ ఎడిషన్ ర్యాంకింగ్స్‌ కాగా మొత్తం 13 విభిన్న కేటగిరీలలో యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్ విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్ ప్రకటించారు.

ఓపెన్ యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో మూడు కొత్త కేటగిరి ర్యాంకులను కూడా విడుదల చేశారు. ర్యాంకింగ్స్ విషయంలో ఈ సంవత్సరం ఎక్కువ విద్యాసంస్థలను పరిగణనలోకి తీసుకున్నారు. 10,000  కంటే ఎక్కువ విద్యాసంస్థలను నిర్ఫ్ ర్యాంకింగ్స్ 2024లో పరిశీలించారు. ఇంజినీరింగ్ విభాగంలో వరుసగా ఏడేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తున్న ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది ఓవరాల్‌గా కూడా నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది.

టాప్ ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల ర్యాంకింగ్స్..
1 – ఐఐటీ మద్రాస్
2 – ఐఐటీ ఢిల్లీ
3 – ఐఐటీ బాంబే
4 – ఐఐటీ కాన్పూర్
5 – ఐఐటీ ఖరగ్‌పూర్

టాప్ రీసెర్చ్ విద్యాసంస్థలు
1. ఐఐఎస్‌సీ బెంగళూరు
2. ఐఐటీ మద్రాస్
3. ఐఐటీ ఢిల్లీ
4. ఐఐటీ బాంబే
5. ఐఐటీ ఖరగ్‌పూర్

టాప్-5 యూనివర్సిటీలు
1. ఐఐఎస్‌సీ బెంగళూరు
2. జేఎన్‌యూ
3. జామియా మిలియా ఇస్లామియా
4. మణిపాల్ విశ్వవిద్యాలయం
5. బిహెచ్‌యూ

టాప్-5 మేనేజ్‌మెంట్ కాలేజీలు
1 – ఐఐఎం అహ్మదాబాద్‌
2 – ఐఐఎం బెంగళూరు
3 – ఐఐఎం కోజికోడ్
4 -ఐఐటీ ఢిల్లీ
5 – ఐఐఎం కోల్‌కత్తా

రాష్ట్ర స్థాయి ప్రభుత్వ యూనివర్సిటీల ర్యాంకులు..
1 – అన్నా యూనివర్సిటీ
2 – జాదవ్‌పూర్ యూనివర్సిటీ
3 – ఎస్‌పీపీయూ
4 -కోల్‌కత్తా విశ్వవిద్యాలయం
5 – పంజాబ్ విశ్వవిద్యాలయం
6 – ఉస్మానియా యూనివర్సిటీ
7 – ఆంధ్రా యూనివర్సిటీ
8 – భారతియార్ యూనివర్సిటీ
9 -కేరళ విశ్వవిద్యాలయం
10 – కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News