Sunday, November 17, 2024

దేశ రాజకీయ యోధుడు కల్యాణ్ సింగ్ : అద్వానీ

- Advertisement -
- Advertisement -

Country's political warrier Kalyan Singh: Advani

న్యూఢిల్లీ: కల్యాణ్ సింగ్ దేశ రాజకీయాల్లో యోధుడని, ఆయన అంకిత బావం, మార్గదర్శకం, నిజాయితీ అయోధ్య అంశాన్ని పరిష్కరించడానికి దోహదం చేసిందని, అంతేకాక బిజెపి పార్టీకి ఎంతోబలం చేకూర్చిందని బిజెపి వృద్ధ నేత ఎల్‌కె అద్వానీ జీవిత విశేషాలను గుర్తు చేశారు. కల్యాణ్ సింగ్‌కు ఆయన ఆదివారం నివాళులు అర్పించారు. రామాలయ స్వప్నం సాకారం కావాలని ఎవరైతే కలలు కన్నారో వారికి ఆయన ఆదర్శాలు సాకారం చేశాయని గుర్తు చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిర్విరామంగా శ్రమించారని, ఉత్తర ప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఎంతో అంకితమయ్యారని, బిజెపి అధ్యక్షునిగా ఎంతోకాలం సేవలందించారని ప్రశంసించారు. రామజన్మభూమి ఉద్యమంలో ఆయనతో తాను పంచుకున్న ఎన్నో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సింగ్ మరణం తీరని పెద్ద లోటని, ఆయన నిస్వార్థ వ్యక్తిత్వం అనేక తరాల పాటు భారతీయులకు స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు.

కల్యాణ్ సింగ్ నాకు పెద్దన్న : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్

కల్యాణ్ సింగ్‌ను తానెప్పుడూ తనకు పెద్దన్నలా భావించేవాడినని దేశ రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పేర్కొన్నారు. కల్యాణ్ సింగ్‌కు ఆయన ఆదివారం నివాళి అర్పించారు. మేమంతా మాజీ సిఎంలమైతే, నీవు మాత్రం అసాధారణ మైన ప్రత్యేక ముఖ్యమంత్రివి అని తాను కల్యాన్ సింగ్‌తో అంటుండేవాడినని, దానికి ఆయన సమాధానంగా చిరునవ్వు నవ్వే వారని రాజ్‌నాధ్ సింగ్ చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సంతాపం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం తీవ్ర సంతాపం వెలిబుచ్చుతూ కల్యాణ్ షింగ్‌కు నివాళులు అర్పించారు. దేశం, మతం, ప్రజల కోసం .జీవితాన్ని అంకితం చేసిన కల్యాణ్ సింగ్‌కు శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ఆయన చేసిన విశేష కృషికి దేశం, రాబోయే తరాలు ఎల్లపుడూ రుణపడి ఉంటాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌పి చీఫ్ మాయావతి, తదితరులు సంతాపం వెలిబుచ్చారు.

సోమవారం అంత్యక్రియలు

అలిగఢ్‌కు 60 కిమీ దూరంలో ఉన్న నరోరా పట్టణంలో సోమవారం కల్యాణ్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అధికార లాంఛనాలతో జరుగుతాయి. సోమవారం ఉదయం కల్యాణ్ షింగ్ పార్థివ దేహాన్ని అలిగఢ్ నుంచి ఆయన కర్మహూమి జన్మభూమి అయిన అత్రౌలికి చేర్చనున్నట్టు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. అలాగే సోమవారం ప్రశుత్వ శెలవు దినంగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News