Sunday, December 22, 2024

సైబర్ సెక్యూరిటీ లేకుండా దేశ ప్రగతి అసాధ్యం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) తొలి వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. సైబర్ క్రైమ్ సరిహద్దులనేవి లేవని, కనుక అంతా కలిసి దీన్ని ఎదుర్కోవాలని అన్నారు.

‘‘సైబర్ సెక్యూరిటీ లేకుండా దేశ ప్రగతి అసాధ్యం.  మానవాళికి టెక్నాలజీ ఓ వరం. ఆర్థికవ్యవస్థ బలోపేతం కాడానికి టెక్నాలజీ బాగా ఉపయోగపడుతోంది. అదే సమయంలో టెక్నాలజీతో ముప్పులు కూడా ఉన్నాయి. దేశ భద్రతకు సైబర్ సెక్యూరిటీ కీలకంగా మారింది. సైబర్ సెక్యూరిటీ లేకుండా మన దేశం సురక్షితం కాజాలదు. ఐ4సి వంటి ప్లాట్ పామ్స్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించగలవు’’ అని అమిత్ షా తెలిపారు.

రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం 5000 సైబర్ కమాండోలకు శిక్షణ ఇచ్చి, సంసిద్ధులను చేయనున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News