- ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
చౌడపూర్: సమస్యలు పర్కిరించేందుకే పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పల్లెబాటలో భాగంగా ఆయన శనివారం మండల పరిధిలోని చిన్న మేక్య తండా, నీర్సాబ్ తండా, చాకలపల్లి కిష్ణంపల్లి, మరికల్, కన్మన్ కాల్వ, బంగరం పల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామానికి వెళ్లి సమస్యలు తెలుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యమంలో ఎంపిపి సత్య హరిశ్చంద్ర, పిఎసిఎస్ వైస్ చైర్మన్ నాగరాజ్, జెడ్పిటిసి రాందాస్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు, మఠం రాజశేఖర్, అశోక్, గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.