Thursday, January 23, 2025

వ్యభిచారం చేయిస్తున్న భార్య, భర్త అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతులతో వ్యభిచారం చేయిస్తున్న భార్య భర్త, యువతిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లర్ నంబర్ 159 వద్ద గొడవ జరుగుతోందని డయల్ 100కు ఫోన్ రావడంతో అత్తాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. ఎంజి కాలనీకి చెందిన షేక్ సోనియా, బంగ్లాదేశ్‌కు చెందిన స్త్రిస్తి గొడవపడుతున్నారు. వారిని పోలీసులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. షేక్ సోనియా ఆమె భర్త సల్మాన్ కలిసి వ్యభిచార శిబిరం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌కు చెందిన యువతిని నెలన్నర క్రితం వ్యభిచారం చేసేందుకు తీసుకుని వచ్చారు. యువతి ఎలాంటి పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు అక్రమంగా వచ్చింది. ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ జరగడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యుతిని సోనియా చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ రప్పించుకోవడంతో అత్తాపూర్ పోలీసులు కేసును అక్కడికి బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News