Wednesday, January 22, 2025

మంథనిలో దంపతుల దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Couple brutally murdered in Peddapalli District

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. దుండగులు దంపతులను అత్యంత కిరాతకంగా హత్యచేశారు. దంపతుల ముఖాలపై ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. మృతులను కొత్త సాంబయ్య, లక్ష్మిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మంథని సీఐ సతీష్, ఎస్ఐ చంద్ర కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పాతకక్షలు, భూ తగాదాల వల్లే హత్యలు జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జంటహత్యలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News