Monday, December 23, 2024

45 పిస్టల్స్‌తో పట్టుబడ్డ దంపతులు

- Advertisement -
- Advertisement -

Couple caught with 45 pistols

స్మగ్లింగ్‌లో దిట్టలు … మరో వ్యక్తి ఫరార్

న్యూఢిల్లీ : 45 పిస్టల్స్‌తో వచ్చిన భారతీయ దంపతులను స్థానిక విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం కస్టమ్స్ అధికారులు వీరిని గమనించి ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే ఇవి నిజమైన గన్స్ అవునా లేక బొమ్మవా? అనేది ఉగ్రవాద నిరోధక అనుబంధమైన జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జి) నిర్థారించుకుంటుంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టింది. అయితే ఇవి నిజమైన గన్స్ మాదిరిగా ఉన్నాయని అధికారులు ఇప్పటికైతే తేల్చిచెప్పారు. గన్స్ పూర్తి స్థాయిలో పనిచేసే సామర్థంతోనే ఉన్నాయని ప్రాధమిక నివేదికలో ఎన్‌ఎస్‌జి తెలిపిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

అయితే ఇవి నిజమైన గన్స్ అని పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఎన్‌సిజి నిర్ధారించలేదు. ఇన్ని గన్స్‌తో విమానాశ్రయంలో పట్టుబడ్డ భార్యభర్తలు జగ్‌జీత్ సింగ్, జస్వీందర్ కౌర్ అని గుర్తించారు. వీరు వియత్నాంలోని హో చి మిన్హ్ సిటి నుంచి వచ్చారు. వీరిని అరెస్టు చేసి వీటి గురించి ఆరా తీస్తున్నారు. రెండో పెద్ద ట్రాలీబ్యాగుల నిండా ఈ గన్స్ తెచ్చారు. వీరి వెంట వీరి ఓ చిన్నారి అయిన కూతురు కూడా ఉంది. ఈ గన్స్ బ్యాగులను వీరి విమానం వచ్చిన సమయంలోనే ఇక్కడికి పారిస్ నుంచి వచ్చిన సింగ్ పెద్ద సోదరుడు మంజిత్ సింగ్ అందించి వెళ్లారని వెల్లడైంది.

పరారయి ఈ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. వీరు దేశంలో ఈ గన్స్ స్మగ్లింగ్‌కు యత్నించినట్లు ప్రాధమిక దర్యాప్తులో తెలింది. ట్రాలీ బ్యాగులను భర్త తీసుకుని వెళ్లుతుండగా గుర్తించారు. భార్య కూడా చురుగ్గా ఆయనకు సహకరించింది. ఈ గన్స్ విలువ రూ 22.5 లక్షల వరకూ ఉంటుంది. ఈ బ్యాగుల ట్యాగుల తీసివేత, వీటిని జాగ్రత్తగా బయటకు తరలించడంలో భర్తకు భార్య సహకరించినట్లు వెల్లడైంది. దంపతుల కూతురును నానమ్మకు అప్పగించిన తరువాత దంపతులను కస్టడీకి పంపించారు. తాము ఇంతకుముందు కూడా లక్షల విలువైన గన్స్‌ను రవాణా చేసినట్లు దంపతులు తెలిపారు. వీటిని ఇండియాకు టర్కీ నుంచి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News