Monday, December 23, 2024

ఇంటర్ లో 990 మార్కులు… ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Couple commit suicide in Rangareddy

రంగారెడ్డి: ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి మైలార్‌దేవ్‌పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మైలార్‌దేవ్‌పల్లిలోని నేతాజీ నగర్‌లో నారాయణ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. నారాయణకు అనూష(17) అనే కూతురు ఉంది. ఇంటర్‌లో అనూషకు 990 మార్కులు రావడంతో రాష్ట్ర స్థాయి టాపర్లలో ఒకరుగా ఉన్నారు. అనూష తన ఇంటి పక్కన ఆటో డ్రైవర్ రవితో ప్రేమలో పడింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో రవిని అనూష కుటుంబ సభ్యులు మందలించడంతో వారు శంషాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని రవి కుటుంబం ఉంటుంది. శంషాబాద్ వెళ్లి వస్తున్న రవి తన పాత ఇంటి దగ్గరికి వెళ్లాడు. అనూష, రవి ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం ఒకే తాడుకు ఉరేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ రోహిత్ అక్కడికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News