Sunday, December 22, 2024

బంధువులు కావడంతో ప్రేమజంట ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Love couple commit suicide in Rajasthan

 

మన తెలంగాణ/ విశాఖపట్నం న్యూస్: ప్రేమ జంట లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీకాకుళం జిల్లాకు చెందిన దామోదర్(20), ఆదపాక సంతోషి(17) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు దగ్గరి బంధువులు కావడంతో ప్రేమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పోకోరని అనుమానంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రేమజంట విశాఖపట్నం చేరుకొని ఆర్టిసి కాంప్టెక్స్ సమీపంలోగొల్లెల పాలెంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ప్రేమజంట గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లాడ్జికి చేరుకొని బలవంతంగా డోర్లు ఓపెన్ చేసి చూడగా బాత్‌రూమ్‌లో ఇద్దరు ఉరేసుకున్నారు. యువతి మెడలో తాళి ఉందని పోలీసులు వెల్లడించారు. పిల్లలు తమకు చెప్పి ఉంటే పెళ్లి చేసేవాళ్లమని ఇరు కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు.

ఇవి కూడా చదవండి….

మార్కెట్లో నడిరోడ్డుపై యువకుడిని వేటకొడవళ్లతో నరికి….

ఫోన్ దొంగలించాడని?… బావిలో బాలుడిని వేలాడదీసి…

అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదని… బైక్ కు కట్టేసి లాక్కెళ్లారు… (వీడియో వైరల్)

బల్బును ఎత్తుకెళ్లిన ఎస్ఐ…. సోషల్ మీడియాలో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News