Sunday, January 19, 2025

చెరువులో దూకి దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చెరువులో దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. గ్రామస్థులు, పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పంతంగి కృష్ణారావు (55) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య పంతంగి సీత (53) ఇద్దరూ కలిసి శనివారం తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో రావి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం కలిగించింది.

తెల్లవారుజామున భార్య, భర్తలు ఇద్దరు గ్రామ సమీపంలోని రావి చెరువు వద్దకు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు స్థానిక సిసి కెమెరాలో రికార్డు కావటంతో వాటిని చూసిన గ్రామస్థులు పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీస్‌లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు. భార్యాభర్తల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News