- Advertisement -
హైదరాబాద్: ఓవైపు ఐపిఎల్ మ్యాచులు అభిమానులకు వినోదాన్ని పంచుతుంటే.. మరోపక్క బెట్టింగ్ భూతం కొందరి జేబులను ఖాళీ చేస్తోంది. ఐపిఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి నగరంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. అయితే వీళ్ల ఆటకట్టించేందుకు పోలీసులు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా హఫీజ్‌పేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్యలను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి రూ.55 వేల నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీస్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే అజయ్ గతంలో నాలుగు సార్లు క్రికెట్ బెట్టింగ్ నేరంలో అరెస్టై జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
- Advertisement -