Wednesday, January 22, 2025

బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్.. భార్యాభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

దౌల్తాబాద్: ఉతికిన బట్టలు ఆరవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై భార్యాభర్తలు మృతి చెందిన విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా, బొంరాస్‌పేట్ మండల పరిధిలోని బురాన్‌పూర్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…బురాన్‌పూర్ గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్ (40) బోయిని లక్ష్మి(38) భార్యాభర్తలు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం వారి ఇంటి ముందు ఉన్న ఇనుప తీగపై బట్టలు ఆరవేస్తుండగా లక్ష్మణ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీనిని గమనించిన భార్య భర్తను కాపాడాలనే ఆత్రుతలో తాను కూడా విద్యుత్ షాక్‌కు గురైంది.

ఈ క్రమంలో వారిద్దరూ అక్కడి కక్కడే మృతి చెందారు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ రావూప్ తెలిపారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. భార్యాభర్తలు ఇద్ద్రూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News