జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామయ్యపల్లె గ్రామానికి చెందిన కూస చంద్రయ్య (60), అతని భార్య భాగ్యమ్మ (55) నూతన సంవత్సర సందర్బంగా ధర్మపురి చర్చిలో మంగళవారం రాత్రి జరిగిన ప్రార్థనలో పాల్గొని బుధవారం తెల్లవారుజామున 2ః30 నిమిషాలకు ఇంటికి తిరిగి వస్తున్నారు.
ఆ సమయంలో ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా భాగ్యమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల కోడలు కూస సునీత ఫిర్యాదు మేరకు కారు అజాగ్రత్తగా నడిపి రోడ్డు ప్రమాదానికి కారుకుడైన మంచిర్యాలకు చెందిన నూలుకొండ అన్షుమాన్‌పై కేసు నమోదు చేసి చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉదయ్ కుమార్ తెలిపారు.