Tuesday, January 21, 2025

కారులో ఆస్పత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు దంపతులు

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ : ఉదయపూర్‌ జిల్లా బాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న దంపతులు, కుమారుడు చికిత్స కోసం ఉదయపూర్‌లోని ఎంబి ఆసుపత్రికి కారులో వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంతలో కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు నీటిలో మునిగి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కుమారుడిని గ్రామస్తులు నదిలో నుంచి బయటకు తీశారు.

ప్రస్తుతం మృతుల మృతదేహాలను ఎంబీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన కుమారుడు ఎంబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబాలకు అప్పగించనున్నారు. తండ్రి చికిత్స కోసం ఎంబి ఆసుపత్రికి వెళ్తున్నారని బద్‌పురా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అయితే మార్గమధ్యంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. నదిలో లోతుగా నీరు ఉండడంతో నీటిలో మునిగి చనిపోయారు. అయితే ఈ సమయంలో అటుగా వెళ్తున్న స్థానిక గ్రామస్తులు అతడిని గమనించారు. అనంతరం వారిని కాపాడేందుకు గ్రామస్థులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే నీటిలో మునిగిపోతున్న దంపతుల కుమారుడిని గ్రామస్థులు చాలా శ్రమించి బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ దంపతులు చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దంపతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News