Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

వైరా: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన వైరాలోని క్రాస్‌రోడ్ సెంటర్ నందు శనివారం జరిగింది. సత్తుపల్లి నుండి హైదరాబాద్ కు స్కూటీపై వెళ్తున్న దంపతులు రంగా సురేష్ (38),రోజా(34) హైదరాబాద్ లో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. శనివారం సత్తుపల్లి నుండి హైదరాబాద్ వెళ్తుండగా వైరాలోని క్రాస్‌రోడ్ సెంటర్ వద్ద వెనక నుండి టిప్పర్ వెనక నుండి ఢి కొట్టడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు మృతదేహాలను పొస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైరా పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News