Monday, December 23, 2024

మహబూబాబాద్ జిల్లాలో దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహబూబాద్ లో గత నెల తమ ఇద్దరు కూతుళ్లను చంపేశారని భావిస్తున్న దంపతులు ఉరేసుకున్నారు. అడవిలో వారి మృత దేహాలు వేలాడుతూ లభించాయి.  ఆ దంపతులను కందగట్ల అనిల్, దేవి లుగా గుర్తించారు. వారు తమ కూతుళ్లను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెం గ్రామంలో గత నెల చంపేశారని భావిస్తున్నారు.

మూడేళ్ల లోహిత, పదకొండేళ్ల జషితలకు పాలలో విషం కలిపి మార్చిలో చంపేశారని సమాచారం. వారు చనిపోయిన ప్రదేశంలో పోలీసులకు కీటకనాశిని మందు కలిపిన పాల బాటిల్ దొరికింది. వారిని చంపిది వారి తల్లిదండ్రులేనని అనుమానిస్తున్నారు. అనిల్ తండ్రి వెంకన్న ఇరుగుపొరుగుకు తెలుపగా వారు తలుపులు పగుల గొట్టి ఇద్దరు పిల్లలు చనిపోయి ఉండడాన్ని కనుగొన్నారు. అప్పటి నుంచి అనిల్, దేవి కనిపించకుండా పోయారు. కాగా గురువారం అనిల్, దేవి అడగుట్ట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. పోలీసులు కేస్ ను బుక్ చేసి దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News