- Advertisement -
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం మల్లంపల్లిలో చోటు చేసుకుంది. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేటకు చెందిన ఎండి మహమ్మూద్ (53), షహీన (45) దంపతులు తమ కుమారుడితో కలిసి ఆదిలాబాద్ జిల్లా ఆపిఫాబాద్‌కు పని నిమిత్తం వెళ్లి సొంత గ్రామమైన బుధరావుపేటకు బయలుదేరారు.
ద్విచక్రవాహనంపై భార్యాభర్తలు మల్లంపల్లి నుండి బుధరావు పేటకు బయలుదేరే క్రమంలో మల్లంపల్లి వద్ద నర్సంపేట జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ బలంగా బైక్‌ను ఢీకొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి ఎస్సై వెంకటేశ్వరరావు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -