Tuesday, December 24, 2024

వాష్‌రూములో విషవాయువు పీల్చి జంట మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు:తమ ఇంట్లోని వాష్‌రూములో విషవాయువు పీల్చి ఒక జంట మరణించింది. వాష్ రూములోని గీజర్ నుంచి వెలువడిన విషవాయువు పీల్చి వారిద్దరూ మరణించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఆ జంటను చామరాజనగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్, బెలగావి జిల్లాకు చెందిన సుధారాణిగా గుర్తించారు. బెంగళూరుకు చెందిన యలహంక తాలూకాలోని తరమనహల్లి గ్రామంలో ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఈ సంట పనిచేస్తోంది.

వాష్‌రూములోని కిటికీలు, తలుపు మూసివేసి గీజర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి వీరిద్దరూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరూ మరణించిన మరుసటి రోజున ఈ విషయం వెలుగు చూసింది. ఆదివారం మధ్యాహ్నం వీరిద్దరినీ వెతుక్కుంటూ హోటల్ సిబ్బంది ఇంటికి వచ్చారు. లోపల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందచేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా వాష్‌రూములో విగతజీవులై వీరిద్దరూ కనిపించారు. వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News