Tuesday, January 21, 2025

చౌటుప్పల్ విషాదం.. దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కాపూర్ స్టేజి వద్ద హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మరణించినవారిని నర్సింహారెడ్డి(63), సరోజిని(58) దంపతులుగా పోలీసులు గుర్తించారు. ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలసీులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News