Monday, December 23, 2024

శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం షాద్ నగర్ రోడ్డు మార్గంలోని ఘాన్సీమియాగూడ సమీపంలో వేగంగా వచ్చిన ఓ షిఫ్టు కారు, ఆటో, బైక్ లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ కల్వర్టులోకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు మృతి చెందారు.

ఆటో, బైక్ వెళ్తున్న పలువురు గాపయడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News