Friday, December 20, 2024

నాగర్‌కర్నూల్ లో విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు మృతి

- Advertisement -
- Advertisement -

ఆర్టీసీ బస్సు ఢీకొని భార్యాభర్తలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రంలో అనారోగ్యం కారణంగా భార్యభర్తలు.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి బైక్ పై ఇంటికి వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు బైక్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ప్రయాణిస్తున్న భార్యభర్తలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

అయితే, భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భర్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య కూడా చనిపోయింది.ఈ ప్రమాదంలో మరణించిన భార్యభర్తలను.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన తిరుమలేష్(27), లక్ష్మీ (22)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News