- Advertisement -
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన జనగామలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మంగళవారం రాత్రి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన దంపతలను తమిళనాడుకు చెందిన సెల్వరాజు, భాగ్యలక్ష్మీగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైన హత్య చేశారనా? అనే కోణంలో ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -