Saturday, April 5, 2025

నిజామాబాద్‌లో విషాదం.. దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను స్వామి(45), దేవలక్ష్మి(40)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లిదండ్రులు విగతజీవులై కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News