Wednesday, January 22, 2025

కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు

- Advertisement -
- Advertisement -

వెల్దుర్తి: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్యహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కాశమైన హేమలత (28), మహేష్ (36)లు భార్యాభర్తలు. కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య గతకాలంగా కుటుంబ కలహాల వల్ల గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో హేమలత ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

దీంతో భార్య హేమలత మరణం తట్టుకోలేక మహేష్ మండలంలోని శ్రీనివాస్‌నగర్ రైల్వే స్టేషన్ సమీంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా భర్తలు ఇద్దరు మృతి చెందడంతో గ్రామ పలువురిని కట్టతడి పెట్టించాయి. తల్లిదండ్రులు మృతి చెందడంతో ముగ్గురు చిన్నారుల రోదనలు విన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News