Sunday, December 22, 2024

విమానం గాల్లో… బాత్రూమ్ లో శృంగారం…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ఈజీ జెట్ విమానం గాల్లో ఉన్నప్పుడు ఓ జంట బాత్రూమ్‌కు వెళ్లి బయటకు రాకపోవడంతో సిబ్బంది డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశారు. ఆ జంట బాత్రూమ్‌లో శృంగారం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 5 మిలియన్ల మంది వీక్షించారు. ఆ డోర్ ఓపెన్ చేయగా ఆ జంట ఆశ్లీలంగా కనిపించడంతో ప్రయాణికులు నోళ్లు తెరిచి షాక్‌కు గురయ్యారు. విమానం లూటాన్ నుంచి ఐబిజాకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఐబిజా విమానం ల్యాండ్‌కాగానే ఆ జంటను పోలీసులకు విమాన సిబ్బంది అప్పగించారు. పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్న వివరాలు బయటకు రాలేదు. నెటిజన్లు ఆ జంటను దుమ్మెతిపోస్తున్నారు. ఎక్కడా స్థలం దొరకనట్టు విమానంలో ఆ పని చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉండే చాన్స్ ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News