Monday, December 23, 2024

పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Couple found hanging at home in UP

లక్నో: పిల్లలు లేరని దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలో బల్మికి నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్దోయి జిల్లాకు చెందిన నీలమ్(28) తొమ్మిది సంవత్సరాల క్రితం రాహుల్ కుశ్వాహ(33) పెళ్లి చేసుకున్నాడు. బిల్హర్స్ నగర్‌లోని మురాద్ నగర్‌లో దంపతులు నివసిస్తున్నారు. దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో మనోవేధనకు గురయ్యాడు. పిల్లలు పుట్టడంలేదని పలుమార్లు దంపతులు స్థానికులు, బంధువుల వద్ద వాపోయారు. సోమవారం ఉదయం దంపతులు ఉరేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ అధికారులు ధనేష్ ప్రసాద్, రాజేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ తల్లి సుష్మా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. వివాహం జరిగి తొమ్మిది సంవత్సరాలైన పిల్లలు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News