Thursday, December 26, 2024

ఇంటి పైకప్పు గోడ కూలి దంపతులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

ఇంటి పైకప్పు గోడ కూలి మీద పడి బార్యభర్త లు గాయపడిన సంఘటన గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో చో టు చేసుకుంది. విశ్వాసనీయ సమాచారం మేరకు గ్రామానికి చెందిన బ క్కయ్యోల్ల మహిపాల్ దంపతులు శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో సుమారు 1 గంట ప్రాంతంలో ఆకస్మాత్తుగా ఇంటి పైకప్పు గోడ కూలి వారిపై పడటం జరిగింది. దాంతో పెద్ద శబ్దం రావడంతో చు ట్టుప్రక్కల వారు నిద్రలేచి వారిని ప్రమాదం నుంచి కాపాడటం జరిగింది. ఆ దంపతులు దాదాపు 15 నిమిషాల పాటు ఆ మట్టిలో ఉండి పోయా రు. వారి పిల్లలు వేరే గదిలో నిద్రించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఆ దంపతులు ఇద్దరు వృత్తి రిత్యా ముంబై ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ మద్యనే దసరా పండగకు గ్రామానికి రావడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News