Monday, December 23, 2024

ఇన్ఫార్మర్లు అనే అనుమానంతో దంపతుల కాల్చివేత

- Advertisement -
- Advertisement -

ఒడిశాలోని కంఢమాల్ జిల్లాలో ఒక జంటను మావోయిస్టులు హతమార్చినట్లు పోలీసులు శనివారం తెలిపారు. తోచ్చపాడా పోలీసు స్టేషన్ పరిధిలోని సలాగూడ పంచాయితీకి చెందిన బిడాపాడర్ గ్రామంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన జరిగినట్లు వారు చెప్పారు. ఈ ఘటన వెనుక సిపిఐ(మావోయిస్టు)కు చెందిన కలహండి-కాంధమాల్–బౌధ్–నయాగఢ్(కెకెబిఎన్) డివిజన్ ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు వారు చెప్పారు. పోలీసు ఇన్ఫార్మర్లు అన్న అనుమానంతో శుక్రవారం రాత్రి దహీరా కన్హర్, అతని భార్య బటాసి కన్హర్‌ను వారి ఇంట్లో నుంచి బయటకు లాగిన మావోయిస్టులు వారిని సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. శనివారం ఉదయం వారి మృతదేహాలు అడవిలో కనిపించాయని వారు చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News