వేములవాడ: వరంగల్ లోని కాశీబుగ్గలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గకు చెందిన ఓ కుటుంబం దైవదర్శనం కోసం కారులో వేములవాడకు బయలుదేరింది. మార్గమధ్యంలోని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి వద్ద హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు. మృతులను కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, సురేందర్ గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న మరో ఇద్దరు మేఘన, అశోక్ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
- Advertisement -
- Advertisement -
- Advertisement -