Monday, December 23, 2024

కారును డీకొట్టిన లారీ.. భార్యాభర్తలు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Couple Killed in Road Accident in West Godawari

పశ్చిమ గోదావరి: జిల్లాలోని గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం గోపాలపురం వద్ద రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వారి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన కుమారుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని బుట్టాయగూడేనికి చెందిన మురళీకృష్ణ, ఊర్మిళాదేవి భార్యాభర్తలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Couple Killed in Road Accident in West Godawari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News