Thursday, November 21, 2024

గాజుల రామారంలో దారుణం

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్ బెట్టింగ్, ఆర్ధిక ఇబ్బందులు తాళలేక, ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన ఇద్దరు చిన్నారులకు, భార్యకు తన ఇంట్లో ఊపిరి అడగకుండా చేసి చంపి అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మంచిర్యాలలో ఉన్న తన తండ్రి ఫోన్ లో మాట్లాడి ఆత్మహత్యకు పాల్పడుతున్నామని చెప్పడంతో తండ్రి వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్ సహస్ర అపార్ట్ మెంట్‌లో గత మూడు సంవత్సరాల క్రితం మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40) వర్షిణి (38) కుటుంబం అద్దెకు దిగారు. వీరికి ఇద్దరు పిల్లలు రిషికాంత్ (11) నారాయణ స్కూల్‌లో 6 తరగతి చదువుతున్నాడు. విహంత్ (3) చిన్నవాడు.

వెంకటేష్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తునారు. గత కొద్దీ నెలలుగా ఆన్‌లైన్ లోన్స్‌తో ఇబ్బంది పడుతున్న వెంకటేష్ ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతను తన భార్య వర్షిణి, ఇద్దరు చిన్నారులకు ఊపిరి అడకుండా చేసి తన ఇంట్లో గదిలో చంపి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే చనిపోయే ముందు తండ్రితో ఫోన్ లో మాట్లాడిన వెంకటేష్ తాము చనిపోతున్నట్లు చెప్పి ఈ దారుణనానికి ఒడిగట్టాడు. వెంటనే మృతుని తండ్రి వాచ్‌మెన్‌కు ఉదయం 3ః00 మూడు గంటల సమయంలో ఫోన్ చేసి వెంకటేష్ వారిని నిద్ర లేమని చెప్పాడు. అప్పుడు వారు లేవ లేదని తిరిగి 5ః30 వచ్చి వాచ్‌మెన్ తలుపు కొట్డగా లేవడం లేదని, అనంతరం ప్రక్కన వారికి తెలుపగా ఇంట్లో వారంతా విగత జీవులై ఉన్నారని జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చామని వాచ్‌మెన్ తెలిపారు. ఉదయం అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఘటన స్థలానికి వచ్చి చూసే సరికి పిల్లలు ఇద్దరు ఒక రూమ్ లో భార్య వర్షిణి మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు. భర్త వెంకటేష్ ఉరి వేసుకొని మృతి చెందారని, జీడిమెట్ల పోలీసులు తెలిపారు. కుటుంబ ఆత్మహత్య ఘటన స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. బాలానగర్ డివిజన్ ఏసిపి హనుమంతరావు ఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు ఆరా తీయాలని సిబ్బందికి సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News