Sunday, January 12, 2025

రైలు కింద పడి యువ దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు , రైల్వే పోలీసులు తెలిపిన వకథనం ప్రకారం.. జిల్లాలోని తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడకు చెందిన మంజునాథ్, పొట్లుారి మండలం గరుగు గ్రామానికి చెందిన రమాదేవి గత ఆరు నెలల క్రితం పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. తాడిపత్రి సమీపంలోని తెల్లవారిపల్లి వద్ద రమాదేవి సోమవారం సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెలుసుకున్న రమాదేవి తల్లిదండ్రులు పోలీసులకు అల్లుడిపై ఫిర్యాదు చేశారు. తమ కూతురు వరకట్న వేధింపుల వల్లే చనిపోయిందని పోలీసులకు తెలిపారు. దీంతో మంజునాథ్ మంగళవారం ఉదయం తాడిపత్రిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నవ దంపతులు ఏందుకు ఆత్మహత్య చేసుకున్నారో అని ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News