Wednesday, January 22, 2025

నదిలో ముద్దు పెట్టుకున్న దంపతులపై దాడి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

లక్నో: పుణ్య నదిలో స్నానం చేస్తుండగా దంపతులు ఇద్దరు ముద్దు పెట్టుకోవడంతో భక్తులు భర్తపై దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని సరయూనదిలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయోధ్యలో సరయూ నదిలో భక్తులందరూ స్నానాలు చేస్తుండగా భార్య భర్తలు ముద్దుపెట్టుకున్నారు. వెంటనే అక్కడున్న ఓ భక్తుడు ఇలాంటి అశ్లీల పనులు చేయకూడదని హెచ్చరించాడు. వెంటనే అతడిపై పలువురు భక్తులు దాడి చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News