Sunday, January 19, 2025

ఢిల్లీ మెట్రోలో ముద్దుల వర్షం కురుపించిన యువ జంట

- Advertisement -
- Advertisement -

 

 

ఢిల్లీ: ఓ యువ జంట ఢిల్లీ మెట్రోలో ముద్దుల వర్షం కురుపించింది. ఇద్దరు ఒక వైపు కూర్చొని గాఢంగా చుంబనం ఇచ్చుకున్నారు. జంట ముద్దు పెట్టుకుంటుండగా భగత్ ఎస్ చింగ్‌శుబమ్ అనే వ్యక్తి ఫొటో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ ఫొటోను 1.4 మిలియన్ల మంది వీక్షించారు. ఢిల్లీ మెట్రో, యెల్లోలైన్ అనే యాష్ ట్యాగ్‌తో పాటు ఢిల్లీ పోలీస్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీమెట్రోకు ట్యాగ్ చేశాడు. సాక్షి అనే యువతిని 16 సార్లు పొడిచిన స్థానికులు పట్టించుకోలేదని, నిర్భయ, ఆమె స్నేహితుడు రక్తపు మరకలతో నగ్నంగా ఉన్నప్పుడు కూడా ప్రజలు పట్టించుకోలేదని, ప్రతీ రోజు మహిళలు లైంగిక వేధింపులకు గురైన పట్టించుకోవడంలేదని డాక్టర్ ధృవ్ చౌహాన్ అనే నెటిజన్ తన ట్విట్టర్ లో కామెంట్ చేశాడు. పబ్లిక్‌లో ముద్దు గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ధృవ్ చౌహాన్ ఎదురు ప్రశ్నించాడు. జంటపై అసూయతో ఫొటో తీసి ఉంటాడని మనీష్ ఫౌడ్జర్ అనే నెటిజన్ కామెంట్ చేశాడు. సాక్షి, నిర్భయ విషయంలో ఎవరు స్పందించలేదని ఇలాంటి విషయంలో మాత్రం త్వరగా స్పందిస్తారని కామెంట్ చేశాడు. కానీ మెట్రో రైళ్లలో తల్లిదండ్రులు తన పిల్లలతో కలిసి ప్రయాణిస్తారని, అశ్లీల దృశ్యాలు పబ్లిక్ లో చేయకూడదని ప్రితేష్ అనే నెటిజన్ కామెంట్ పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News