Tuesday, January 21, 2025

నవదంపతులను కాటేసిన కాలం….

- Advertisement -
- Advertisement -

అమరావతి: మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. నవదంపతులపై కాలం కన్ను కుట్టడడంతో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంఘటన కర్నాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరంగప్ప (30), సుమ(26) మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. శ్రీరంగప్ప అనే మెరుబాగల్ సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో అత్తారింటికి తన భార్యతో కలిసి వెళ్లాడు. దాసరహళ్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే భర్త మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భార్యను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. రెండు గ్రామాల ప్రజలు విషాదంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News